Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా నాన్నగారు నాకిచ్చిన ఆస్తులేమీ లేవు: మాదాల రవి

Nenu Saitham Movie
  • నాన్న దానధర్మాలు ఎక్కువగా చేసేవారు 
  • నేనే ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను 
  • అమెరికా నుంచి రావడానికి కారణమదేనన్న మాదాల రవి  
తాజా ఇంటర్వ్యూలో మాదాల రంగారావు తనయుడు మాదాల రవి మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "మా నాన్నగారు నాకు ఆస్తులేమీ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన దానధర్మాలు ఎక్కువగా చేసేవారు. నేను సంపాదనలో పడ్డాక, చేతికి ఇస్తే తీసుకోరనే ఉద్దేశంతో ఆయన చూడకుండా కొంత డబ్బు ఆయనకు అందుబాటులో పెట్టేసి వచ్చేవాడిని. కానీ ఆ సాయంత్రానికే ఎవరో ఒకరికి ఆయన ఆ డబ్బును దానం చేసేవారు.

అమెరికాలో డాక్టర్ గా నేను మంచి పోజీషన్లో వున్నందువలన .. హైదరాబాదులో స్థిరపడాలనే ఆలోచన వున్నందు వలన నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. నేను ఇక్కడికి వచ్చింది కూడా కమర్షియల్ హీరోగా నిలబడిపోవాలని కాదు. అభ్యుదయ భావాలు కలిగిన సినిమాలను ఈ తరానికి తగినట్టుగా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను.  ఒక వైపున డాక్టర్ గా పనిచేస్తూనే, 'నేను సైతం' అనే సినిమా తీయడానికి కారణం అదే" అని చెప్పుకొచ్చారు.
Madala Ranga Rao
Madala Ravi
Nenu Saitham Movie

More Telugu News